ఆటో ట్రాక్టర్ డి ఒకరు మృతి
Mbmtelugunews//హుజూర్ నగర్,మార్చి 27 (ప్రతినిధి చింతా రెడ్డి గోపిరెడ్డి):సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం చింతలపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ది 27/03/25 గురువారం నాడు ఉదయం సుమారు 7 గంటల సమయంలో గాంధీనగర్ తండా వద్ద దొండపాడు వైపు నుండి వస్తున్న ఆటో నెంబర్ TS 24TB 8126 గల ఆటో చింతలపాలెం వైపుకి వస్తుండగా ఎదురుగా ట్రాక్టర్ లో మిర్చి లోడు వేసుకొని వస్తున్న ట్రాక్టర్ అతివేగంగా అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి ఎదురుగా వస్తున్న ఆటో కి టక్కర్ ఇవ్వడంతో ఆటో నడుపుతున్న డ్రైవర్ తాటికొండ నగేష్ కు తలకు బలమైన రక్త గాయాలు అయినవి.వెంటనే నగేష్ ను చికిత్స నిమిత్తం108 వాహనంలో హుజూర్ నగర్ గవర్నమెంట్ హాస్పటల్ కు పంపనైనది .

హుజూర్ నగర్ లో ప్రధమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం సూర్యాపేట గవర్నమెంట్ హాస్పిటల్ కు పంపించినారు.సూర్యాపేట గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ నగేష్ మరణించినాడు.ఇట్టి ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ వివరాలు తెలుసుకోనగా అట్టి డ్రైవర్ పేరు అజ్మీర గాంధీ అని తెలిసింది ఇట్టి ట్రాక్టర్ కు నెంబర్ లేదు.ఈ ప్రమాదానికి కారణమైన అజ్మీర గాంధీ పై చట్టరీత్య చర్య తీసుకోమని మృతుడు నగేష్ మేనల్లుడు అయిన బిక్కుమల్ల ఉపేందర్ దరఖాస్తు ఇవ్వనైనది.ఇట్టి దరఖాస్తుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని ఎస్సై అంతిరెడ్డి తెలిపారు.