ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలి.
: పట్టణంలో ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు
:వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు లైసెన్సు తప్పనిసరిగా ఉండాలి.
: పరిమితికి మించి ఆటోలలో ప్రయాణికులను ఎక్కిస్తే కఠిన చర్యలు
Mbmteluginews//కోదాడ,అక్టోబర్ 04(ప్రతినిధి మాతంగి సురేష్):బాలుర హైస్కూల్ ల్లో డ్రైవర్లు అవగాహన సదస్సు శుక్రవారం కోదాడ ట్రాపిక్ ఎస్సై మల్లేష్,మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జిలానీ ఆద్వర్యం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ పట్టణ సీఐ రాము పాల్గొని మాట్లాడారు.లోకల్ ఆటోలలో 3 ప్లస్ వన్ మాత్రమే ఉండాలి ఎక్కువ మందిని ఎక్కించుకోవడం వల్ల ఏదైనా యాక్సిడెంట్లు సంభవిస్తే భారీ నష్టాలు జరుగుతున్నాయని అన్నారు.ప్రతి ఒక్క ఆటో డ్రైవరు యూనిఫామ్ వేసుకోవాలి ఆటో ఎనక ఆటో పట్టణంలో ఆపితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సంత అడ్డా ఆటోలకు కూడా పోలీస్ నెంబర్లు వేయాలని అడ్డా యూనియన్ సభ్యులు వారిని కోరినారు. సంత ఆటోల బంపర్లు అధికారులు తీయమనగా అవి ఉండటం వల్ల వెహికల్ కి డ్రైవర్ కి సేఫ్టీ ఉంటదని ఆటో యూనియన్ సభ్యులు అడిగినారు. పట్టణంలో ఆటోలు తోలుకునేవారు దాని మీదనే జీవనం కొనసాగిస్తున్నారు వారికి చదువు లేకపోవడం వల్ల కొంతమందికి లైసెన్సులు రావడం లేదు అట్టి వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆటో యూనియన్ సభ్యులు కోరినారు. అనంతరం ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్,మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జిలానిలను యూనియన్ సభ్యులు శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో సంత అడ్డా యూనియన్(సర్పంచ్)శ్రీను కోశాధికారి,వి రాజు,కమిటీ సభ్యులు మాజీ సర్పంచ్ లు,యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.