నడిగూడెం,మార్చి 12(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తెలంగాణ మహిళా శక్తి పథకాన్ని నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టబోతున్న సందర్భంగా స్థానిక శాసన సభ్యురాలు నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి సారధ్యంలో హైదరాబాదులోని పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభకు స్థానిక జడ్పిటిసి బాణాల కవిత నాగరాజు ఆధ్వర్యంలో భారీ ఎత్తున మహిళలతో హైదరాబాదు వెళ్లడం జరిగింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ మహిళా శక్తి శ్రీకారం ఉద్దేశం మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పథకం పున ప్రారంభించడం జరుగుతుంది.63.86 లక్షల మహిళలకు 5 లక్షల జీవిత బీమా, తొలి ఏడాది ఒక్కొక్క గ్రామ సంఘానికి కోటి చొప్పున 5000 కోట్ల మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు.

ప్రతి అసెంబ్లీకి ప్రత్యేక చిన్న తరహా పారిశ్రామిక పార్కులు మహిళా సంఘాల ఉత్పత్తులకు బ్రాండింగ్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని అన్నారు.ఈ అవకాశాన్ని రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోదాడ నియోజకవర్గ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి సారధ్యంలో ప్రతి ఒక్క మహిళ సద్వినియోగం చేసుకోని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏపిఎమ్ రామలక్ష్మి , సాంబయ్య,విబికే లావణ్య,లాల్ మహమ్మద్,మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



