ఆదివాసి మహిళపై అత్యాచార చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి:బర్కం వెంకటలక్ష్మి నవీన్ యాదవ్
Mbmtelugunews//సిరిసిల్ల జిల్లా,సెప్టెంబర్ 05:ఆదివాసి మహిళపై అత్యాచారం చేసి దాడి చేసిన నిందితున్ని రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని బిజెపి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బర్కం వెంకటలక్ష్మి నవీన్ యాదవ్ డిమాండ్ చేశారు. సిరిసిల్లలోని అంబేద్కర్ చౌక్ వద్ద బిజెపి మహిళా మోర్చా నాయకురాళ్ళు నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైదరాబాదులో 31వ తేదీన ఆదివాసి మహిళపై ఓ వర్గానికి చెందిన ఆటో డ్రైవర్ అత్యాచారం చేసి దాడి చేశారని తెలిపారు.ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమని అన్నారు.ఓవైసీ బ్రదర్స్ ఈ అత్యాచారాన్ని చిన్న ప్రమాదంగా చిత్రీకరించడం దారుణమని,వెంటనే సీఎం రేవంత్ రెడ్డి నిందితుడికి కట్టిన శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు పండుగ మాధవి,భవిత,చొప్పదండి శ్రీనివాస్,గాజుల సదానందం,మ్యాన రాంప్రసాద్,కోడం శ్రీనివాస్,గాజుల వేణు,ఆడెపు రవీందర్,శ్రీకాంత్ రెడ్డి,సురేష్,గుడ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.



