కోదాడ,జూన్ 28(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఆపద లో ఉన్న జర్నలిస్టులను ఆదుకుంటామని ఎలక్ట్రానిక్ మీడియా నియోజకవర్గ అధ్యక్షులు పడిశాల రఘు అన్నారు.బుధవారం చిలుకూరు మండలం చెన్నారిగూడెం గ్రామానికి చెందిన జర్నలిస్టు సైదులు తండ్రి అనారోగ్యంతో మృతి చెందగా ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యంని పట్టణంలోని మెట్రో ఫ్యాషన్ షాప్ వద్ద అందజేసి ఆ కుటుంబానికి అండగా నిలిచారు.మృతుని కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ ప్రతి ఒక్క జర్నలిస్టు ఎటువంటి జీతాలు లేకుండా విలేకరి వృత్తిని ఎంచుకొని ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సమాజానికి సేవ చేస్తున్నారని తెలిపారు.నిరుపేద జర్నలిస్టు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో పూర్ణచంద్రరావు,శ్రీకాంత్,శేఖర్,లక్ష్మణ్,కాసర్ల సత్యరాజు,బుచ్చి రాములు,నజీర్,వీరబాబు,అత్తాబ్ మహిమూద్,లక్ష్మీనారాయణ అత్తర్,బాబురావు,శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
ఆపదలో ఉన్న జర్నలిస్టులకు యూనియన్ ఎప్పుడు అండగా ఉంటుంది
RELATED ARTICLES