కోదాడ,జులై 32 (mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మండల పరిధిలోని తమ్మర బైపాస్ లో గల మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ ను కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ మొక్కలు నాటి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ తోటల రైతులకు సబ్సిడీ రుణాల అందిస్తూ రైతులకు ఆయిల్ ఫామ్ మొక్కలను ఫ్రీగా అందజేస్తున్నట్లు వారు తెలిపారు.అదేవిధంగా రైతులను ప్రోత్సహించడానికి ఎరువుల కింద ఎకరానికి 4200 చొప్పున మూడు సంవత్సరాలు రైతులకు ఫ్రీగా అందజేస్తున్నట్లు తెలిపారు మూడు సంవత్సరాల తర్వాత రైతులకు పంట చేతికొచ్చి రైతుకు ఆదాయంతో రైతులు ఆనందంగా జీవించవచ్చని, లాభసాటిగా వ్యాపారాలు చేసుకోవచ్చని వారు తెలిపారు ఈరోజు తన సొంత భూమిలో ఆయిల్ ఫామ్ తోటలు వేస్తున్న బొల్లు వెంకట రామకృష్ణ రైతును అభినందించారు రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వానికి అండగా నిలవాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్లు,సర్పంచ్ వెంకటేశ్వర్లు,కౌన్సిలర్ సామినేని నరేష్,మైస రమేష్,కందుల చంద్రశేఖర్,కోట మధు,మేదర లలిత,ఖదీర్ పాషా,ఒంటిపులి శ్రీను,నెమ్మది దేవమని,హార్టికల్చర్ ఆఫీసర్ అనిత,పతాంజలి డీజీఎం యాదగిరి,పతాంజలి మేనేజర్ హరీష్,ఆఫీసర్స్ శేషు కుమార్,వెంకటేష్,ఫీల్డ్ అసిస్టెంట్ నరేష్ ,లక్ష్మణ్ మరియు బజ్జగూడెం తండావాసులు,ఎస్టీ సెల్ అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
ఆయిల్ ఫామ్ తోటల రైతులకు ప్రభుత్వం సబ్సిడీ రుణాలు ,ఆయిల్ ఫామ్ మొక్కలు ఫ్రీగా అందజేత.:మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.
RELATED ARTICLES