కోదాడ,నవంబర్ 18(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ ల పేరుతో ప్రజలను మాయమాటలకు గురిచేసి మోసం చేస్తుందని కోదాడ నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా మునగాల మండల పరిధిలోని మాధవరం,ఈదూలవాగు తండ,నెలమర్రి,వెంకట్రాంపురం వివిధ గ్రామాల మీదుగా ప్రచారం నిర్వహించిన కోదాడ బిఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామ రక్ష అన్నారు.ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందన్నారు.గ్రామాలలో రౌడీ రాజకీయాలు చేసింది కాంగ్రెస్ కాదా అన్నారు.పచ్చని సంసారంలో పగలు ద్వేషాలు నింపినది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు.

60 ఏళ్ళల్లో జరగని అభివృద్ధి గత పదేళ్లలో జరిగిందన్నారు.ప్రతిదళిత కుటుంబానికి దళిత బంధు వచ్చేవిధంగా చూస్తానన్నారు.ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి గృహాలక్షి ద్వారా రేపు సంక్రాంతికి దగ్గరుండి ముగ్గు పోయిస్తా అన్నారు.ఈ నెల 30 వ తారీకు జరగపోయే ఓట్లనాడు కార్ గుర్తు పై ఓటేసి పైన కేసీఆర్ ను,కోదాడలో నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపియ్యాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు,గ్రామ శాఖ అధ్యక్షులు,సర్పంచులు,ఎంపీటీసీలు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



