Saturday, January 24, 2026
[t4b-ticker]

ఆరోగ్య అవగాహన సదస్సు పేదలకు దుప్పట్లు పంపిణీ

ఆరోగ్య అవగాహన సదస్సు పేదలకు దుప్పట్లు పంపిణీ

:కోదాడ నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ నాయకులు యేసయ్య పాస్టర్.

Mbmtelugunews//కోదాడ, జనవరి 27(ప్రతినిధి మాతంగి సురేష్): స్థానిక తమ్మరబండలోని సుందరయ్య కాలనీలో ప్రజల యొక్క ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తల పై కోదాడ నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ నాయకులు పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏనుష్ రాజు పాల్గొని ప్రజల యొక్క ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకొని పిల్లలకు గర్భిణులకు మంచి ఆరోగ్యం కల్పించే విధంగా ఆహారం తీసుకోవాలని, చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని అంటువ్యాధుల నివారించాలని అన్నారు. ఈ సందర్భంగా యేసయ్య మాట్లాడుతూ సుందరయ్య కాలంలోని ప్రజలు ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకొని అనుకోకుండా వచ్చే వ్యాధులను నిర్మూలించడానికి వ్యక్తిగత శుభ్రత పరిసరాల పరిశుభ్రత వంటగదిలో శుభ్రత మంచినీరు త్రాగే విషయంలో తగు జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా చలికాలం తీవ్రంగా ఉన్నందున మీటింగ్ లలో పాల్గొన్న స్త్రీలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బొజ్జ గోపి, సీనియర్ క్రైస్తవ నాయకులు ఏజే సామ్యూల్, ప్రభుదాస్, రాజేష్, శాంతవర్ధన్, చంద్రకాంత, హరిగోన్స్, విజయ లక్ష్మి, మాధవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular