కోదాడ,జులై 05 (mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తెలంగాణ బీసీ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ నాయుడు దేశినేని వారి కుమార్తె ఆరోగ్య మాత జ్ఞాపకార్థం స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో మరియు శనగల రాధాకృష్ణ మానసిక వికలాంగుల ఆశ్రమంలో బ్రెడ్స్,ఫ్రూట్స్,స్నాక్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా పాప జ్ఞాపకార్థం నేను అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటానని అన్నారు. దీనిలో భాగంగానే నేడు ప్రభుత్వ హాస్పిటల్లో పేషెంట్లకు మరియు
శనగల రాధాకృష్ణ మానసిక వికలాంగుల ఆశ్రమంలో మానసిక విద్యార్థులకు పంపిణీ చేశామని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ సురేష్ నారాయణ, బీఎస్పీ అనంతగిరి మండల అధ్యక్షులు నూకల గోపాలస్వామి యాదవ్,హాస్పిటల్ సిస్టర్ జ్యోతి,సిబ్బంది మణెమ్మ,జానయ్య,బత్తుల కోటి,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.