ఆర్టిఈ 2009 ఏసిటీ ని అమలు చేయాలి:కర్ల ప్రేమానంద్
కోదాడ,జూన్ 26(mbmtelugunews))ప్రతినిధి మాతంగి సురేష్:విద్యా హక్కు చట్టం ఆర్టిఈ 12(1)(C) ద్వారా అన్ని ప్రయివేట్,కార్పొరేట్ స్కూల్స్ లో ఉచిత అడ్మిషన్లు అయ్యేలా చొరవ తీసుకోవాలి.ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాఠ్యపుస్తకాలు,స్టేషనరీ,యూనిఫాంలను స్కూల్ యాజమాన్యం సూచించే చోటే కొనాలన్న ఖచ్చితమైన నిబంధనలేమి పెట్టరాదు.అయినా వీటి అమ్మకాలకు పాఠశాలలల్లో కౌంటర్లు ఏర్పాటు చేయకుండా చూడండి.పాఠశాల యజమాన్యాలు సూచించిన చోటు కొనకుండా చూడండి.అలాగే పాఠశాలల బోర్డులపై ఇంటర్నేషనల్ ఐఐటి ఒలంపి యాడ్,కాన్సెప్ట్,ఈటెక్నో అనే తోకలు తగిలించినవి,తొలగించాలి.ఐదు శాతానికి తగ్గకుండా లాభాలను మాత్రమే ఆశించాలి అనే అంశం.వసూలు చేసిన ఫీజుల్లోంచి 50% మొత్తాన్ని ఉపాధ్యాయులకు వేతనాలుగా చెల్లించాలి అనే అంశం పై సమగ్ర విచారణ చేయాలి.ప్రతి ఏడాది వార్షికనివేదికలు,ఆడిట్ రిపోర్ట్ ను ప్రభుత్వానికి సమర్పించలేని పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలి.అధిక ఫీజుల నియంత్రణ చేపట్టాలి అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తో బోధన జరిగేలా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లాలని మనవి.పై అంశాలను తెలియజేస్తూ బహుజన స్టూడెంటు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బిఎస్ఎఫ్ఐ) ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్చార్జి,రాష్ర్ట కార్యదర్శి కర్ల ప్రేమనంద్ ఎంఈఓ సలీం షరీఫ్ కి వినతిపత్రం అందజేశారు.



