ఆర్టీసీ ద్వారాల వద్ద ప్రైవేట్ వ్యక్తుల ఆక్రమణ
:ఇష్టను రీతిగా బండ్లు పెట్టించి డబ్బులు దండుకుంటున్న ప్రైవేటు వ్యక్తులు
:సంబంధిత అధికారులకు ముడుపులు ముడుతున్నట్లు గుసగుసలు
Mbmtelugunews//కోదాడ,జనవరి 06(ప్రతినిధి మాతంగి సురేష్)కోదాడ పట్టణంలోని టీఎస్ఆర్టీసీ బస్టాండ్ లోపల నుండి బస్సులు బయటికి వచ్చే మూలమలుపు వద్ద,బయట నుండి బస్టాండు లోపలికి బస్సులు వెళ్లే మూలమలుపు వద్ద కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించి వారు పళ్ళ వ్యాపారస్తులకు కిరాయిలకిస్తున్న వైనం పట్టించుకోని సంబంధిత అధికారులు. ఈ పండ్ల పనిలో ఉండటం వలన మూలమలుపులో బస్సులు తిరగకపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న డ్రైవర్లు. ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని బస్టాండ్ కార్నర్ లో పండ్ల బండ్లు లేకుండా చూడాలని పలువురు డ్రైవర్లు వాపోతున్నారు.