ఆస్క్ అందించే చిరు సోపానాలే మీ భవిష్యత్తు విజయానికి బాటలు కావాలి:పందిరి నాగిరెడ్డి
కోదాడ,మే 16(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం గత 12 సంవత్సరాలుగా నిర్వహించడానికి వేదికను అందిస్తున్న ఎమ్మెస్ కాలేజ్ చైర్మన్ పందిరి నాగిరెడ్డికి ఆస్క్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు.ఈ సందర్భంగా పందిరి నాగిరెడ్డి మాట్లాడుతూ రోజు రోజుకి సమాజంలో పడిపోతున్న నైతిక విలువలను పెంపొందించడానికి ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని,అందుకు ఆస్క్ చేస్తున్న కృషిని గుర్తుంచుకొని భవిష్యత్తులో విజయానికి బాటలు వేసుకోవాలని ఆకాంక్షించారు.అదేవిధంగా ఆస్క్ కి వివిధ రూపాలలో సహకరిస్తున్న కెఆర్ఆర్ కళాశాల డిగ్రీ లెక్చరర్ సోమపంగు రామారావు,ట్రాఫిక్ ఏఎస్ఐ కొంగల వెంకటేశ్వర్లులను కూడా ఆస్క్ ఆధ్వర్యంలో సన్మానించారు.ఆస్క్ అధ్యక్షురాలు బల్గూరి స్నేహ దుర్గయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మాతంగి ప్రభాకర్ రావు,ఎమ్మెస్ కళాశాల సీఈవో ఎస్ఎస్ రావు,కోర్సు డైరెక్టర్ యలమర్తి శౌరి,నందిపాటి సైదులు,కోర్స్ కో-ఆర్డినేటర్ గంధం బుచ్చారావు,అమరబోయిన వెంకటరత్నం,బీవీ రాజు,చెరుకుపల్లి కిరణ్,కే శ్రీకాంత్,విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



