Wednesday, March 18, 2026
[t4b-ticker]

ఆస్క్ అధ్యక్షురాలిని సన్మానించిన ఆస్క్ సభ్యులు

ఆస్క్ అధ్యక్షురాలిని సన్మానించిన ఆస్క్ సభ్యులు

:15 సంవత్సరాలుగా ఉచిత కోచింగ్ సెంటర్ ను నిర్వహించడం అభినందనీయం.

:ఆస్క్ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసిన సభ్యులు

Mbmtelugunews//కోదాడ, మార్చి 18( ప్రతినిధి మాతంగి సురేష్): గత 15 సంవత్సరాల నుండి స్థానిక ఎమ్మెస్ జూనియర్ కళాశాలలో ఉచిత పాలిటెక్నిక్, టిఎస్ఆర్జెసి కోచింగ్ ను ఏర్పాటు చేసి ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఆస్క్ (అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం) అధ్యక్షురాలు బల్గూరి స్నేహ దుర్గయ్య ను వారి నివాసంలో ఆస్క్ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం ఈ సంవత్సరం కూడా ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి ఉచిత కోచింగ్ సెంటర్ ను నిర్వహించాలనే సంకల్పంతో ఆస్క్ సభ్యుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎమ్మెస్ కళాశాలలో ఉచిత కోచింగ్ సెంటర్ నిర్వహిస్తామని వారు తెలిపారు. పదవ తరగతి పరీక్షలు అయిపోయిన వెంటనే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆస్క్ సభ్యులు మాగి గురవయ్య, కుడుముల స్వామి దాస్, బల్గూరి దుర్గయ్య, ఎలమర్తి శౌరి, గంధం బుచ్చారావు, మాతంగి ప్రభాకర్ రావు, బొడ్డు హుస్సేన్, చెరుకుపల్లి కిరణ్, అమరబోయిన వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular