ఆస్తికోసం హత్యకు పాల్పడిన కుటుంబ సభ్యులు.
:భర్తపై భార్య, కుమారుల హత్యాయత్నం.
:నిందితులను రిమాండ్ కు తరలించిన పోలీసులు.
Mbmtelugunews//సూర్యాపేట,అక్టోబర్ 10(ప్రతినిధి మాతంగి సురేష్): ఆస్తికోసం ఒక వ్యక్తిపై సొంత భార్య తన ఇద్దరు కుమారులను ప్రోత్సహించి హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది రూరల్ సీఐ రాజశేఖర్,స్థానిక ఎస్సై గోపికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం పెన్ పహాడ్ మండల పరిధిలోని మేఘ్యతండ గ్రామానికి చెందిన ఆంగోతు కురువాకు సుమారు 24 సంవత్సరాల క్రితం కోటమ్మతో వివాహం జరిగింది వీరికి ఇద్దరు కుమారులు పవన్ కళ్యాణ్, ప్రవీణ్ కుమార్ సంతానం ఉన్నారు కోటమ్మకు అక్రమ సంబంధం ఉన్నదని భావించి కురువ తన భార్యతో మనస్పర్ధలు గొడవల నేపథ్యంలో వీరు ఇరువురు గత 4 సంవత్సరాలుగా వేరువేరుగా సూర్యాపేటలోని శాంతినగర్ లో భార్య మేఘ్య తండాలో భర్త జీవిస్తున్నారు. కురువ గ్రామంలో తనకున్న 6 ఎకరాల వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తుండగా కోటమ్మ సూర్యాపేట శాంతినగర్ లో కుమారులతో కలిసి నివాసం ఉంటుంది ఇటీవల కురువ తనకున్న భూమిలో కొంత భూమిని అమ్మాలని అనుకుంటున్న విషయం తెలిసిన వీరు ముగ్గురు మానవత్వాన్ని, రక్త సంబంధాన్ని మరచి కురువ బ్రతికి ఉంటే భూమి తమకు దక్కదని దురుద్దేశంతో కోటమ్మ ఇద్దరు కుమారులను ప్రోత్సహించి కురువను చంపాలనే ఉపాయంతో గత సోమవారం మేఘ్య తండాలోని తమ తండ్రి వద్దకు వెళ్లి అర్ధరాత్రి సుమారు 12:30 గంటల సమయంలో కురువ శబ్దం చేయకుండా నోట్లో గుడ్డ కుక్కి,కండ్లకు గంతలు కట్టి ఇనుప రాడ్ ,కర్రతో రెండు కాళ్లపై, చేతులపై ఎడమ దవడ పై విచక్షణ రహితంగా దాడి చేసి చంపే ప్రయత్నం చేశారు చుట్టుపక్కల వారు వస్తారనే భయంతో తమ తండ్రిని ద్విచక్ర వాహనంపై సూర్యపేట ప్రభుత్వ హాస్పిటల్ లో చేర్పించి అక్కడి నుంచి పారిపోయారు బాధితుడు కురువా ఫిర్యాదు మేరకు భార్య కోటమ్మ ,కుమారులు పవన్ కళ్యాణ్, ప్రవీణ్ కుమార్ ల పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన సిఐ రాజశేఖర్ దర్యాప్తు చేస్తుండగా శుక్రవారం కుమారులు ఇద్దరు మేఘ్యతండాకు వచ్చారనే సమాచారంతో వెంటనే వారిని పట్టుకుని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు….



