కోదాడ,మార్చి 06(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో క్రైస్తవుల పవిత్రమైన పండుగలు గుడ్ ఫ్రైడే,ఈస్టర్ పండుగలకు ముందుగా క్రైస్తవులు ఎంతో భక్తిశ్రద్ధలతో 40 రోజుల ఉపవాసం దీక్ష ప్రార్థనలు నిర్వహిస్తారు.స్థానిక నయానగర్ బాప్టిస్ట్ చర్చిలో నేటికీ 20 రోజులు ఉపవాస దీక్షలు కొనసాగుతున్నాయి ప్రార్థనలో దేశ సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న సంక్షేమాల కొరకు వైద్యం హోం శాఖ రెవెన్యూ శాఖ సైనికుల కొరకు ఇంటర్మీడియట్ రాస్తున్న,టెన్త్ విద్యార్థినీ విద్యార్థుల కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తున్నారు.

ఈ ప్రార్థనలు ఈ మాసం చివరి వరకు నిర్వహిస్తారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు,స్త్రీలు,యవ్వనస్తులు ,చిన్నపిల్లలు అధిక సంఖ్యలో పాల్గొని ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేస్తున్నారు.



