Sunday, April 12, 2026
[t4b-ticker]

ఇంటర్మీడియట్ ఫలితాలలో ఎన్ఆర్ఎస్ విద్యార్థుల ప్రభంజనం.

ఇంటర్మీడియట్ ఫలితాలలో ఎన్ఆర్ఎస్ విద్యార్థుల ప్రభంజనం.

:ఫస్ట్ ఇయర్ లో వరుస స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు.

:ఇంగ్లీష్ లో 100 కు 100 మార్కులు సాధించిన విద్యార్థి.

:సెకండ్ ఇయర్ లో అత్యుత్తమ మార్కులతో ప్రతిభ.

Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 12(ప్రతినిధి మాతంగి సురేష్): ఆదివారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ప్రధమ ద్వితీయ పరీక్ష ఫలితాలలో కోదాడ పట్టణానికి చెందిన ఎన్ఆర్ఎస్ కాలేజీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఫస్ట్ ఇయర్ లో వరుసగా 468, 467, 466, 465 మార్కులు సాధించి వరుస స్టేట్ ర్యాంకులు సాధించారు. కాలేజ్ కు చెందిన వేముల వెంకట విశాల్ 468 మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించాడు. 467 మార్కులతో డి చరిష్మా, ఎస్ విమల లు స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించాడు. వైష్ణవి 466, అంజనీ 465 లు మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో వీరు 432 మార్కులు సాధించాడు. సెకండ్ ఇయర్ లో అమృత సుధా వర్షిణి 988, లక్కం రక్షిత 987, ఎరబోలు శరణ్య 986 మార్కులు సాధించారు.ఇంగ్లీష్ పేపర్ లో 100 మార్కులు సాధించిన విద్యార్థి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ లో కాలేజ్ కి చెందిన ఎస్ విమల 100కు 100 మార్కులు సాధించి రికార్డ్ సృష్టించింది. తొలిసారిగా ఇంగ్లీష్ పేపర్ లో 100 కు 100 మార్కులు సాధించడం తమ కాలేజ్ కు గర్వకారణమని ఈ సందర్భంగా కాలేజ్ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి అన్నారు.

ఈ ఫలితాల మాదిరిగానే జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ పరీక్షలలో జాతీయ స్థాయి ర్యాంకు లు సాధించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా కాలేజ్ లో జరిగిన కార్యక్రమంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి, డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాల రావు, ప్రిన్సిపాల్ గంధం వెంకటరమణ , పీఆర్వో మల్లికార్జున రావులు ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ లెక్చరర్లు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular