Sunday, December 28, 2025
[t4b-ticker]

ఇంటర్ ఫలితాలలో ఎన్ఆర్ఎస్ విద్యార్థుల అద్భుత ప్రతిభ

:బైపీసీ లో రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంకు,ఎంపీసీ లో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించిన ఎన్ఆర్ఎస్ విద్యార్థులు.

:స్థాపించిన మొదటి సంవత్సరంలోనే అత్యుత్తమ ఫలితాలు.

కోదాడ,ఏప్రిల్ 24(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్: బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాల్లో కోదాడ పట్టణానికి చెందిన ఎన్ఆర్ఎస్ కాలేజ్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించారు.ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం  బైపీసీ విభాగంలో కాలేజ్ కు చెందిన భట్టు శిరీష శ్రీ 440 మార్కులకు గాను 435 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంకు,జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది.

ఆమెతో పాటు కాలేజ్ కు చెందిన బి లక్ష్మీపార్వతి 433 మార్కులు,పల్లవి 431 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో ర్యాంకులు  పొందారు.ఎంపీసీ విభాగంలో కాలేజ్ కు చెందిన గాయత్రి 466 మార్కులతో రాష్ట్ర స్థాయిలో నాలుగవ ర్యాంకు,పీవీఎన్ మణికంఠ,గజ్జి వైష్ణవి 465 మార్కులు,హారిక,జీవన్ రాజ్ రెడ్డి,ప్రవల్లిక,హేమశ్రీ లు 462 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో ర్యాంకులు సాధించినట్లు కాలేజ్ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి,డైరెక్టర్ మనోహర్ రెడ్డి,ప్రిన్సిపల్ వేణుగోపాల్ లు తెలిపారు.తమ కాలేజ్ ను స్థాపించిన మొదటి సంవత్సరం లోనే విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.కాలేజ్ నిర్వహణలో ఎన్ని అవరోధాలు ఎదురైనా విద్యార్థులకు కావల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేశామని,విద్యార్థులు కూడా పట్టుదలతో చదివి అద్భుతమైన ఫలితాలు సాధించారని వారు అన్నారు.ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను యాజమాన్యం తో పాటు పలువురు అధ్యాపకులు,సిబ్బంది అభినందించారు.

నీ ప్రాంతంలో ఏమైనా సమాచారం ఉంటే ఈ నెంబర్ 9666358480 కి పంపించగలరు

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular