ఇంటి భాష ద్వారానే విషయంఅవగాహన చేసుకునే సామర్థ్యం అధికం….
:అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయం…
:మాతృభాష ద్వారానే పరభాషలు నేర్చుకోవడం సులభం……..
:సాహిత్య సంస్కృతి వారసత్వ అభివృద్ధి మాతృభాష ద్వారానే సాధ్యం……
Mbmtelugunews//కోదాడ,ఫిబ్రవరి 21 (ప్రతినిధి మాతంగి సురేష్):మండల విద్యాధికారి ఎండి సలీమ్ షరీఫ్
శుక్రవారం నాడు పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోదాడ యందు ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం వేడుకలు కార్యక్రమంలో కోదాడ మండల విద్యాధికారి,పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండి సలీం షరీఫ్ పాల్గొని మాట్లాడినారు.విషయ సమాచారం అవగాహన అర్థం చేసుకోవడం ఇంటి భాష ద్వారానే సులభం.సాహిత్య సాంస్కృతిక వారసత్వ అభివృద్ధి మాతృభాష ద్వారానే జరుగుతుందన్నారు.పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు.పరభాష ఆంగ్లం వ్యామోహంలో తెలుగు మీడియం విద్యార్థులకు తెలుగు లో చదవడం,రాయడం రాకపోవడం శోచనీయమని పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి మార్కండేయ తెలిపారు.

రెండు రాష్ట్రాలలోని మాతృభాష తెలుగు భాష కమ్మదనాన్ని,తీయదనాన్ని,గొప్పదనాన్ని,దేశంలో ప్రాంతీయ భాషా ఉద్యమాలు,భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రాల తీరును పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు ఎం వీర బ్రహ్మచారి,ఎం చిన్నప్ప,ఎం జానకిరామ్ తెలియజేప్పినారు.సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నాటిక,జానపద నృత్యాలు,దేశభక్తి గేయాలు,కవితలు,పాటలు,పద్యాలు ఉపాధ్యాయులు విద్యార్థులను బాగా ఆకట్టుకున్నాయి.అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగు డిపార్ట్మెంట్ ఉపాధ్యాయులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండి.సలీం షరీఫ్,ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు డి మార్కండేయ తెలుగు ప్రధాన ఉపాధ్యాయులు ఎం వీర బ్రహ్మచారిని శాలువా,పూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఈ శ్రీనివాస్ రెడ్డి,వి మీనాక్షి,ఎల్ దేవరాజు,బ్రహ్మానందం,కె రామకృష్ణ,బడుగుల సైదులు,ఎండి.ముక్తార్,రాణి,సునీల,సరిత,విద్యార్థులు పాల్గొన్నారు.