ఇండియన్ మాథ్స్,సైన్సు ఒలంపియాడ్ లో మెరిసిన తేజ విద్యార్థులు
Mbmtelugunews//కోదాడ,మార్చి 28(ప్రతినిధి మాతంగి సురేష్):స్థానిక తేజ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఇండియన్ మాథ్స్,సైన్స్ ఒలంపియాడ్ లో రౌండ్ 2 లో విజయం సాధించారని పాఠశాల ప్రిన్సిపాల్ బి సోమా నాయక్,సెక్రెటరీ సంతోష్ కుమార్ లు విద్యార్ధిని విద్యార్థులను అభినందించారు.ఒకటవ తరగతి నుండి లోవిష,మూడవ తరగతి నుండి బి సాయి కార్తికేయ,నాల్గోవ తరగతి నుండి ఎస్డి నదీం,ఐదవ తరగతి నుండి కె విగ్నేష్,ఏడవ తరగతి నుండి బి రక్షిత్,తొమ్మిదో తరగతి నుండి కె దేదీప్య,సైన్స్ ఒలంపియాడ్ నుండి కె అమితవ్ దీర్ ర్యాంకులు రాష్ట్ర స్థాయిలో సాధించినందుకు పాఠశాల ప్రిన్సిపల్ అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ జానకిరామయ్య పాఠశాల ఇంచార్జ్లు రామమూర్తి,రేణుక మరియు గణిత ఉపాధ్యాయులు మరియు సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.