ఢిల్లీ,సెప్టెంబర్ 05(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:జీ20 సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన అతిథులను ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ పేరుతో కాకుండా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ పేరుతో రాష్ట్రపతి భవన్ విందుకు ఆహ్వానించడంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చకు తెర లేపింది. ఈ వ్యవహారంలో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ గవర్నమెంట్‌కు మద్దతు పలికాడు. తాను ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ఓ పోస్ట్ పెట్టాడు.స్వదేశంలో జరుగబోయే ప్రపంచ కప్‌లో టీమిండియా జెర్సీపై భారత్ అని ఇంగ్లీష్‌లో ఉండేలా చూడాలని బీసీసీఐని వీరూ కోరాడు.
‘ఒక పేరు మనందరిలో గౌరవాన్ని పెంపొందించేలా ఉండాలని నేను ఎప్పటినుంచో నమ్ముతున్నా.మనం భారతీయులం.ఇండియా అనేది బ్రిటీష్‌వాళ్లు వెళ్తూ వెళ్తూ మన దేశానికి ఇచ్చిన పేరు.మనదేశాన్ని పూరాతన,సొంత పేరు అయిన భారత్ అని పిలవడానికి ఇప్పటికే చాలా అలస్యం అయింది.ఈ సందర్బంగా బీసీసీఐకి నా అభ్యర్థన ఏంటంటే..? ప్రపంచ కప్‌లో మన ఆటగాళ్ల జెర్సీలపై భారత్ అని ముద్రించండి’ అని వీరూ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు.ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో జీ20 అతిథులను విందుకు ఆహ్వానించడంపై ఆన్‌లైన్లో పెద్ద చర్చే నడుస్తోంది.ఇండియా పేరును త్వరలోనే భారత్‌గా మారుస్తారనే ప్రచారం జోరందుకుంది.దాంతో,మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు.ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌తో పాటు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా సైతం బీజేపీపై విమర్శలు గుప్పించారు.అయితే.. బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ ప్రభుత్వ నిర్ణయం సరైనదే అంటున్నాడు.బిగ్‌బీ తన ఎక్స్ ఖాతాలో భారత్ మాతా కీ జై అని పోస్ట్ పెట్టాడు.ఆట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది.ఆ పోస్ట్‌కు 2.23 లక్షల మంది చూశారు.12 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.
ఈ ఏడాది ప్రపంచ కప్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది.అక్టోబర్ 5న ఇంగ్లండ్,న్యూజిలాండ్ మ్యాచ్‌తో టోర్నీ ఆరంభం కానుంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్,పాకిస్థాన్ అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో తలపడనున్నాయి.స్వదేశంలో 2011లో వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడిన టీమిండియా ఈసారి కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది.
ఇండియా పేరు మార్పుపై వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు.. ప్రపంచకప్‌లో మన జెర్సీలపై కూడా..
RELATED ARTICLES



