సూర్యాపేట జిల్లా(mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు) తుంగతుర్తి నియోజకవర్గంలో ఈరోజు తిరుమలగిరి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ప్రగతి నివేదిన సభ ఉన్నదున ముందస్తుగా బహుజన సమాజ్ పార్టీ నాయకులను అరెస్టు చేయడం పై ఖండిస్తూ తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షులు మాల్లేపాక వెంకటేష్ అద్యక్షన ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా తుంగతుర్తి నియోజకవర్గ ఉపాధ్యక్షురాలు
కమటం శోభా బాయి మాట్లాడుతూ ప్రగతి నివేదన సభ తుంగతుర్తి నియోజకవర్గం లో పెట్టడం హాస్యాస్పదం ఎందుకంటే రెండుసార్లు ఎమ్మెల్యేగా కొనసాగి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మాటలతో మభ్యపెట్టే కనికట్టు గారడీలు తప్ప ప్రగతి లేదు తుంగతుర్తి నియోజకవర్గం పల్లెల్లో.
100 పడకల ఆసుపత్రి ఉసూ లేదు డిగ్రీ కాలేజ్ కి దిక్కులేదు ఇంటర్ కాలేజీ ఏమాయే ఇవ్వని హామీలు నెరవేర్చకపోగా భూ కుంభకోణాలు ఇసుక దండాలు రౌడీ మాఫియా భూ కబ్జా లు హత్యలు దాడులు తుంగతుర్తి నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఎమ్మెల్యే కనుసైగల్లో నడుస్తున్నాయి ఏ మొహం పెట్టుకొని ఈ గడ్డకు వచ్చారు కేటీఆర్ తిరుమలగిరి మండల కేంద్రంలో కనీసం ప్రయాణికులకు ప్రాంగణము లేక అవస్థలు పడుతున్న ప్రజలు వడ్ల కొనుగోలులో ఘోరమైన స్కామ్లు ఇవి తప్ప ప్రగతి పై మీరు ప్రజలకు ఏమి నీవేదన ఇస్తారు అని ప్రశ్నించారు రాన్నున్న ఎన్నికల్లో ఈ తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు BRS పాలనను బొంద్ద పెట్టీ MLA గాదారి కిషోర్ కుమార్ కి తగిన బుద్ది తప్పకుండా చెప్తారు అని వెల్లడించారు ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మండల అధ్యక్షులు కొమ్ము జయరాజ్ తుంగతుర్తి సీనియర్ నాయకులు ఎర్ర యాకూబ్ దాసరి శ్రావణ్ కుమార్ వడ్డేపల్లి భాష కందుకూరి నరేంద్ర మోడి తీగల వంశీ తదితరులు పాల్గొన్నారు.