ఇద్దరు రేషన్ డీలర్లపై కేసు నమోదు
Mbmtelugunews//చిలుకూరు,నవంబర్ 19(ప్రతినిధి మాతంగి సురేష్):రేషన్ షాపు ఇంట్లో అక్రమంగా నిల్వవుంచిన రేషన్ బియ్యంపై ఇద్దరు రేషన్ డీలర్లు పై కేసు నమోదు అయిన ఘటన చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్లగా బేతవోలు గ్రామంకు చెందిన రేషన్ డీలర్లు ఓరుగంటి లక్ష్మి నరసింహారావు,గిజ్జి సువర్ణ లు రేషన్ షాపుకు వచ్చే లబ్ధిదారుల వద్ద నుండి అక్రమంగా రేషన్ బియ్యంను కొనుగోలు చేసి రేషన్ షాపు ఇంట్లో వేరే గదిలో నిల్వ ఉంచారు.విశ్వసనీయ సమాచారం మేరకు చిలుకూరు పోలీసులు తనిఖీలు నిర్వహించి రేషన్ బియ్యంను పట్టుకున్నారు.వీరు సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇవ్వడంతో కోదాడ సివిల్ సప్లై ఆర్ఐ కృష్ణారెడ్డి పంచనామా చేశారు.లక్ష్మి నరసింహారావు ఇంట్లో 60 బస్తాల్లో 30 క్వింటాళ్ల రేషన్ బియ్యం,సువర్ణ ఇంట్లో 32 బస్తాల్లో 16 క్వింటాళ్లు రేషన్ బియ్యం దొరికినట్లుగా తెలిపారు.దొరికిన బియ్యంను గ్రామంలో మరో డీలర్ కి అప్పగించినట్లుగా తెలిపారు.రేషన్ బియ్యంను అక్రమంగా నిల్వవుంచిన రేషన్ డీలర్లు ఇద్దరిపై సివిల్ సప్లై ఆర్ఐ కృష్ణారెడ్డి పిర్యాదు మేరకు 6 (ఏ) కేసు నమోదు చేసినట్లుగా ఏఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.