ఇరుకుళ్ల రామకృష్ణ జన్మదినం సందర్భంగా రోగులకు అన్న ప్రసాద వితరణ
Mbmtelugunews//కోదాడ,జూన్ 10(ప్రతినిది మాతంగి సురేష్):వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుళ్ల రామకృష్ణ జన్మ దిన సందర్భంగా మంగళవారం నాడు వాసవి క్లబ్,వాసవి వనితా క్లబ్ కోదాడ ల సంయుక్త సహకారం తో కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు సిబ్బందికి 200 మందికి అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేయనైనది.వాసవి క్లబ్ అధ్యక్షులు సేకు శ్రీనివాసరావు ఇరుకుళ్ల రామకృష్ణకు జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు సేకు శ్రీనివాసరావు,సెక్రటరీ పత్తి నరేందర్,కోశాధికారి వెంపటి ప్రసాద్,వాసవి వనిత క్లబ్ అధ్యక్షులు వెంపటి నాగలక్ష్మి,సెక్రటరీ వంగవీటి సుజాత,కోశాధికారి వంకాయల స్వాతి,ఆర్ సి బెలిదే భరత్ కుమార్,ఐపీసి పబ్బా గీత,లోకేశ్, ఆర్ ఈ సి కొండూరి మాధవి,ఆర్ యస్ బోనాల సైదారావు,జడ్ సి లు వంగవీటి నాగరాజు,టి మంజుల,డి ఐ చల్లా లక్ష్మీనరసయ్య,డిపిఓ ఇమ్మడి సతీష్ బాబు,బండారు శ్రీనివాసరావు,ఓరుగంటి రమాదేవి,యాదా రాణి,వాసవి క్లబ్ ఉపాధ్యక్షులు చండూరి నాగమల్లేశ్వరరావు,గౌరవ సలహాదారు దేవరశెట్టి శంకర్రావు,వెంపటి వెంకటేశ్వరరావు,వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.