ఈనెల 19న రన్ ఫర్ జీసస్ ఆధ్యాత్మిక శాంతి ర్యాలీ
Mbmtelugunews//కోదాడ,ఏప్రిల్ 17(ప్రతినిధి మాతంగి సురేష్):ఈ నెల 19న రంగా థియేటర్ చౌరస్తా నుండి ఖమ్మం క్రాస్ రోడ్ వరకు కోదాడ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణ,నియోజకవర్గ క్రైస్తవులు రన్ ఫర్ జీసస్ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాస్టర్ యేసయ్య అన్నారు.కోటయ్య,జాన్ మోజస్,రాంబాబు రన్ ఫార్ జీసస్ గోడపత్రికను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో కోదాడ కోర్ కమిటీ చైర్మన్ సిహెచ్ లూకా కుమార్,వైస్ చైర్మన్ జిఆర్ అబ్రహం,కోఆర్డినేటర్ ఎం సుందర్ రావు నియోజకవర్గ సెక్రెటరీ రాజేష్,పట్టణ అధ్యక్షులు ప్రభుదాస్,మండల అధ్యక్షులు శాంత వర్ధన్ పాల్గొన్నారు.