కోదాడ,ఏప్రిల్ 22(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:నల్గొండ పార్లమెంటు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని ఆశీర్వదించి అఖండ మెజారిటీతో గెలిపించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరుతూ మోతే మండల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఎన్నికల సన్నాహక సమావేశంలో కోదాడ బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్,మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్,పార్లమెంట్ ఎన్నికల పరిశీలకులు కటికం సత్తయ్య గౌడ్ లు పాల్గొని మాట్లాడుతూ….. ఈనెల 24న మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కృష్ణారెడ్డి గెలుపును కాంక్షిస్తూ నిర్వహించే రోడ్ షోలో మోతె మండలం నుంచి అధిక సంఖ్యలో పాల్గొనాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలను అడుగడుగునా నిలదీయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఎంపీ ఎలక్షన్ లో పార్టీ క్యాడర్ అంతా సమిష్టిగా పనిచేసి గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.రుణమాఫీ చేయకుండా,రైతుబంధు 15000 రూపాయలు వేయకుండా, రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి,ధాన్యం బస్తాలపై 500 రూపాయల బోనస్ ను ఎగ్గొట్టడానికే ధాన్యం కొనుగోలుపై సమీక్షల పేరుతో ప్రభుత్వం కాలం వెళ్ళబుచుతుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ప్రజలు 6 గ్యారంటీలను ఇవ్వని ప్రభుత్వాన్ని నిలదీస్తూ నల్గొండ పార్లమెంటు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలిని కోరారు.రైతుల తరఫున పేగులు తెగేదాకా కొట్లాడే ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమే అని అన్నారు.వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తెలంగాణ హక్కులను కాపాడుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.నల్గొండ ఎంపీ అభ్యర్థి కృష్ణారెడ్డి రైతు కుటుంబం నుంచి వచ్చాడని,రైతులు బాధలు తెలిసిన నాయకుడని కృష్ణారెడ్డికి ఓటేసి గెలిపిస్తే పార్లమెంట్లో తెలంగాణ వాదం వినిపిస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు,మాజీ ఎంపీపీ ఆరె లింగారెడ్డి,బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏలూరి వెంకటేశ్వరరావు,ముప్పాని శ్రీధర్ రెడ్డి,నూకల శ్రీనివాస్ రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి మద్ది మధుసూదన్ రెడ్డి,కండక్టర్ వెంకన్న,కొండ ఎంకన్న,సంజీవరెడ్డి,మిక్కిలినేని సతీష్,ఆయా గ్రామ శాఖ అధ్యక్షులు,మాజీ సర్పంచులు,ఎంపీటీసీలు,మాజీ ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మీ ప్రాంతంలో ఏమైనా సమాచారం ఉంటే నెంబర్ 9666358480 కి పంపించగలరు



