Tuesday, July 8, 2025
[t4b-ticker]

ఈ జ్యూస్‌లు తాగితే చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండెకి మంచిదట..

ఈ జ్యూస్‌లు తాగితే చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండెకి మంచిదట..

హెల్త్ టిప్స్,జులై 07(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దీనిని తగ్గించుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.

గుండె:మన బాడీలో ముఖ్య పార్ట్.మనం పుట్టినప్పట్నుంచి నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది.అందుకోసం సిరలు,ధమలను మనకి సపోర్ట్ చేస్తాయి.కానీ,కొన్నిసార్లు గుండెకొట్టుకోవడంలో హెచ్చుతగ్గులుంటాయి.దీనికి కారణం మనం తీసుకునే ఆహారంలో.కొలెస్ట్రాల్ ఫుడ్.చెడు కొలెస్ట్రాల్ తీసుకుంటే మన బాడీలో సిరలు,ధమనుల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది.రక్త ప్రసరణ బలహీనపడుతుంది.ఇది రక్తపోటుని తగ్గిస్తుంది.కాబట్టి, ఈ క్రింది పండ్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు హెల్ప్ చేస్తుంది. అవేంటో తెలుసుకుందాం.

రెడ్ కలర్ ఫ్రూట్స్‌‌ని జ్యూస్ చేసుకుని తాగడం మంచిది.ఇవి రుచిగానే కాకుండా హెల్దీ కూడా.ఇందులో పోషకాలు, యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి.ఇవి మన గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇందులో విటమిన్ సి,లైకోపీన్ ఉంది.కాబట్టి, మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది.వీటిని మీ డైట్‌లో చేర్చుకునే ముందు కార్డియాలజిస్ట్‌తో మీ ఆరోగ్యం గురించి మాట్లాడి సరైన సలహా తీసుకోండి.

క్రాన్బెర్రీ జ్యూస్ మన మూత్ర నాళాలని ఆరోగ్యంగా చేస్తుంది

:గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది.చెడు కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేసే గుణం దీనికి ఉంది.ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మూసుకుపోయిన గుండె ధమనులని సరిచేసి రక్తప్రసరణని ఈజీ చేస్తుంది.

టమోటా జ్యూస్

టమోటా జ్యూస్:వంటల్లో తప్పకుండా వాడే టమాటల్లో కూడా కొలెస్ట్రాల్‌ని తగ్గించే గుణాలు ఉన్నాయి.ఇందులో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంది.ఇవి మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్,గుండె సమస్యల్ని తగ్గిస్తాయి.ఓ గ్లాసు తాజా టమాటలను జ్యూస్ చేసుకుని తాగితే లిపిడ్ ప్రొఫైల్ మెరుగవుతుంది.గుండె ధమనులు శుభ్రమవుతాయి.

చెర్రీస్‌ జ్యూస్

చెర్రీస్‌ జ్యూస్:చెర్రీస్‌లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్,యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.దీనిని తాగడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది.రక్తప్రసరణని మెరుగ్గా చేయడంతో గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

బీట్‌రూట్‌ జ్యూస్

బీట్‌రూట్‌లో నైట్రేట్స్ ఉంటాయి:ఇవి మన రక్తనాళాలను విడదీస్తుంది.మొత్తం శరీరానికి రక్త ప్రసరణని అందిస్తుంది.ఇది రక్తపోటుని తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతుంది.అందుకోసం,రోజూ ఓ గ్లాస్ బీట్‌రూట్ జ్యూస్ తాగితే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

దానిమ్మ రసం

దానిమ్మ రసం:దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్,యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్నాయి.ఇది సహజంగానే రక్తపోటుని తగ్గిస్తుంది.చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తొలగిస్తుంది.ఆరోగ్య నిపుణుల సలహాతో దీనిని తీసుకోవడం మంచిది.

రెడ్ గ్రేప్ జ్యూస్:ఇందులో రెస్వరాట్రల్ ఉంటుంది.ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది గుండె, హృదయనాళ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండె ధమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చేస్తుంది.గుండె,రక్తనాళాల పనితీరుని మెరుగ్గా చేస్తుంది.ఈ పండ్ల జ్యూస్‌లన్నీ చాలా హెల్దీ.ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.అయితే,డాక్టర్ సలహాతోనే వీటిని డైట్‌లో యాడ్ చేసుకోవడం మంచిది.

గమనిక :ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం.ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే.వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular