ఈ దేశానికి నరేంద్ర మోడీ శ్రీరామరక్ష
:తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో బిజేపి అధికారంలో ఉండాలి
:కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అటకెక్కినవి
:కాంగ్రెస్ మాయ మాటలు ప్రజలు ఇక నమ్మేటట్టు లేరు
:ఎంపీ ఎన్నికలలో తెలంగాణలో 14 సీట్లు బిజేపి గెలుస్తుంది
:గడపగడపకు బిజేపి ప్రచారం నిర్వహిస్తున్న బిజేపి రాష్ట్ర నాయకులు డా,, అంజి యాదవ్
కోదాడ,మే 11(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఈ దేశంలో మతకల్లోహాలు కానీ తీవ్రవాద అరాచకాలు గాని లేకుండా దేశం సుభిక్షంగా ఉండాలంటే కేంద్రంలో బిజేపి ప్రభుత్వం అధికారంలోకి రావాలని తెలంగాణ బిజేపి రాష్ట్ర నాయకులు డా,, మల్లెబోయిన అంజి యాదవ్ అన్నారు.బిజేపి ప్రచారంలో భాగంగా అనంతగిరి మండల కేంద్రంలో శనివారం గడపగడపకు ప్రచారం నిర్వహించిన అంజి యాదవ్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ ఎంపీ ఎన్నికలలో బిజేపి కి ఓటేసి 14 స్థానాలు గెలిపించుకున్నట్లయితే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు పోతుందని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అధికారంలోకి రాగానే అటకెక్కించారని వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందారని అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ మాయ మాటలు ఇక ప్రజలు నమ్మే పరిస్థితి లేదని రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓటు అనే ఆయుధం ద్వారా తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.నల్లగొండ పార్లమెంటు బిజెపి అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలుపుకై గడపగడపకు ప్రచారం నిర్వహిస్తున్నామని అన్నారు. సైదిరెడ్డిని గెలిపించి పార్లమెంట్లో కూర్చోబెట్టినట్లయితే కోదాడ,హుజూర్ నగర్ ఈ రెండు నియోజకవర్గాలకు ఎంపీ నిధులు ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చి నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవడానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తాడని అన్నారు.ఈ కార్యక్రమంలోఈ కార్యక్రమంలో కతిమాల వెంకన్న,చింతకుంట సతీష్,పవన్,చంటి,నవీన్,కతిమాల రాధా,యశోద,ఉమా,లక్ష్మి,స్వరూప తదితరులు పాల్గొన్నారు.



