కోదాడ,ఆగష్టు 05(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ టిఎస్ సిపిఎస్ఇయూ కోదాడ డివిజన్ శాఖ సారధ్యంలో ఈ నెల 12 న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించ నున్నట్లు జిల్ల ప్రధానకార్యదర్శి బడుగుల సైదులు,డివిజన్ అధ్యక్షులు పిడమర్తి అంకులయ్య తెలిపారు.శనివారం కోదాడ పట్టణంలో సిసి రెడ్డి స్కూల్ కేంద్రం లో ఎఫ్ఎల్ఎన్ శిక్షణ కార్యక్రమం లోమట్లడుతూ ఉద్యోగులు,ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.రానున్న సాధారణ ఎన్నికలకు ముందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ,సామాజిక భద్రత,గ్యారంటీ లేని సిపిఎస్ ను రద్దు చేసి 2 లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలకు మేలు చేసే విధంగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఇట్టి కార్యక్రమాల్లో ఎఫ్ ఎల్ ఎన్ శిక్షణ కేంద్రం డైరెక్టర్ ఎం రామారావు,ఇన్చార్జులు వసంత,శ్రీనివాస రావు రిసోర్స్ పర్సన్స్ హమీద్,రవీంద్రరావు,సైదయ్య,శ్రీనివాసరావు సిపిఎస్ యూనియన్ కోదాడ మండల డివిజన్ బాధ్యులు ముక్తార్,శేఖర్,సైదిరెడ్డి,సరిత,స్రవంతి,రమాదేవి, జాన్సి,ధనలక్ష్మి, సత్యవతి,అనంతగిరి,కోదాడ మండలం ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ నెల12 న ఉద్యోగులు,ఉపాధ్యాయులు చలో హైదరాబాద్ ను విజయవంతం చేయండి.
RELATED ARTICLES