ఉక్రెయిన్-రష్యా చర్చించుకోవాలి
:కీవ్ ప్రధాని మోదీ ఉద్ఘాటన.
:ఈ సంక్షోభం చిన్నారులకు వినాశకరం:మోదీ
:ఉక్రెయిన్లో మోదీ..జెలెన్స్ స్కీతో ఆత్మీయ ఆలింగనం
:మోదీని హత్తుకుని భావోద్వేగానికి గురైన ఉక్రెయిన్ అధ్యక్షుడు.
:గాంధీ విగ్రహానికి మోదీ నివాళి.
Mbmtelugunews//కీవ్,ఆగస్టు 24:ఉక్రెయిన్ లో పర్యటిస్తున్న భారత ప్రధాని మోదీకి ఆ దేశ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్ స్కీతో భేటీ అయ్యారు.రాజధాని కీవ్లోని అమరుల స్మారక ప్రాంతానికి చేరుకున్న మోదీకి స్వాగతం పలికిన అధ్యక్షుడు జెలెన్స్ స్కీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.మోదీ ని చూడగానే కన్నీటి పర్యంతం.. మోదీని హత్తుకుని భావోద్వేగం.. ఇదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ స్కీ హావాభావాలు..ఉక్రెయిన్ యుద్ధభూమి లో అడుగు పెట్టిన మన ప్రధాని మోదీ..జెలెన్స్ స్కీ భేటీ అయ్యారు.భారత ప్రధాని మోదీ శుక్రవారం ఉక్రెయిన్ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్ స్కీని కీవ్ నగరంలో కలిశారు. కీవ్లోని మహా త్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించి మోదీ పూలమాల వేశారు.