Tuesday, July 8, 2025
[t4b-ticker]

ఉచితంగా నల్ల నీళ్లు అని చెప్పి నీటి పన్ను వసూలు చేస్తున్న సంబంధిత సిబ్బంది:గ్రామాలలో రోడ్లు సరిగా లేక స్కూల్ మానేస్తున్న పిల్లలు:డాక్టర్ అంజి యాదవ్

కోదాడ,ఆగష్టు 07(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి ఉచితం మంచినీటి నల్లను ఇస్తా అని చెప్పి మిషన్ భగీరథ పేరుతో ఇంటింటికి నల్ల వేయించింది కానీ ఆ నీటికి పన్ను వసూలు చేస్తున్నారు.గ్రామాలలో రోడ్లు సరిగా లేక మరియు బస్సు సౌకర్యాలు లేక పిల్లలని స్కూలుకి పంపియట్లేదు అని డాక్టర్ అంజి యాదవ్ అన్నారు. సోమవారం మన ఊరుకు మన గడపకు మన అంజన్న అనే కార్యక్రమంలో భాగంగా చిలుకూరు మండల పరిధిలోని మాధవగూడెం,కొండాపురం, రామచంద్రనగర్,ఆర్లగూడెం,కటకమ్మగూడెం గ్రామాలలో పర్యటించిన డాక్టర్ అంజి యాదవ్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిలుకూరు మండల పరిధిలోని కొండాపురం గ్రామంలో మిషన్ భగీరథ పేరుతో నీరు ఇంటింటికి అందించి వారి వద్ద నుండి నీటి పన్నును వసూలు చేస్తున్నారని అన్నారు.నూతన వాటర్ ట్యాంకులు నిర్మాణం చేయకుండా పాత వాటర్ ట్యాంకులకే మిషన్ భగీరథ నీరు ఎక్కించడం వలన ఆ ట్యాంకులలో పాకురుచేరి నీరు కలుషితమై చర్మ సంబంధిత వ్యాధులు వస్తున్నాయని ప్రజల వాపోతున్నారని అన్నారు.కొండాపురం నుండి ఆర్లగూడెం మీదుగా కోదాడు వచ్చే రహదారి పూర్తిగా ధ్వంసమై గుంటల గుంటలుగా ఏర్పడిందని అన్నారు.ఈ ప్రాంతంలో బస్సులు రాక పిల్లలు స్కూల్ కి పోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.ఇకనైనా సంబంధిత అధికారులు ఈ ప్రాంతాలలో బస్సు సౌకర్యం కల్పించి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రాజశేఖర్ నాయుడు దేశినేని,మట్టయ్య యాదవ్,రవి,కోటయ్య,రాముడు,శివ,తోట కమలాకర్,వెంకటేష్ బాబు,జానకి రాములు, శంకర్,నవీన్,కతిమాల వెంకన్న,చంద్రకళ,గౌతమి,కళావతి మాలోవత్ బాలు,అయ్యప్ప, అప్పారావు,ఎలుగూరి సైదులు గౌడ్ బాణావత్ రాజా,సాయి,సంతోష్ ,గోపి,చిన్న బుజ్జి,స్రవంతి,బాలి లక్ష్మి,సునీత,రమణి,నవీన్,అభినవ్,పవన్,నందు,చంటి తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular