కోదాడ,ఫిబ్రవరి 23(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:అల్వాలపురం గ్రామంలో ఆర్ఎంపి డాక్టర్ శ్రీకాంత్,మద్దెల వీరబాబు అధ్యర్యంలో శ్రీ లక్ష్మీ కంటి హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.ఈ శిబిరం నందు సుమారు 200 మంది కంటి పరీక్షలు నిర్వహించుకున్నారు. పరీక్షలు నిర్వహించుకున్న ప్రజలకు అవసరం ఉన్న వారికి ఉచితంగా శుక్లాల ఆపరేషన్ ఈనెల 26 వ తారీఖున నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మి కంటి హాస్పిటల్ డాక్టర్స్,శ్రీను, వెంకటనారాయణ,గోవిందరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
మీ ప్రాంతంలో ఏమైనా సమాచారం ఉంటే ఈ నెంబర్ 9666358480 కి పంపించగలరు.



