ఉచిత పశువైద్య శిబిరంను ప్రారంభించిన ముత్తవరపు పాండురంగారావు
Mbmtelugunews//కోదాడ,అక్టోబర్ 08(ప్రతినిధి మాతంగి సురేష్):మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండు రంగారావు మిత్రమండలి ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్బంగా ముత్తవరపు పాండురంగారావు మాట్లాడుతూ కోదాడలోనే అతిపెద్ద గ్రామ పంచాయితీ అయిన కాపుగల్లులో పశువైద్యాధికారి లేకపోవడంతో గ్రామ రైతులు ఇబ్బందులు పడుతున్నారని,దీనితో తాను మిత్ర మండలితో కలిసి ఉచితవైద్య శిభిరం ఏర్పాటు చేసి,వైద్యలతో అవసరమైన మందులు పంపిణి చేస్తున్నామని అన్నారు.గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు అని,గ్రామంలో వ్యవసాయం,పశుసంపద ఉంటేనే రైతులు ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారని, వారికి అండగా ఉండాలని ద్యేయంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.ఈ పశువైద్య శిభిరంలో పాల్గొన్న పశు వైద్యాధికారులు రైతులకు సరైన సూచనలు,మందులు ఉచితంగా ఇవ్వటం జరిగిందని, రైతులు కూడా ఎంతో సంతోషంలో ఉన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ తొండపు సతీష్, జిల్లా పశు వైద్యాధికారి శ్రీనివాస్,అసిస్టెంట్ డైరెక్టర్ పెంటయ్య,రామారావు మరి గ్రామ రైతులు పాల్గొన్నారు.