
ఉచిత పాలిటెక్నిక్,టీఎస్ ఆర్జెసి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
:పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు ఆస్క్ ఒక వరం లాంటిది
:విద్యార్థుల నుండి వేలకు వేలు డబ్బులు దండుకుంటున్న కాలంలో ఉచిత కోచింగ్ ఏర్పాట చేయడం అభినందనీయం:మాగి. గురవయ్య,పందిరి నాగిరెడ్డి.
Mbmtelugunews//కోదాడ,మార్చి 28(ప్రతినిధి మాతంగి సురేష్):అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం (ఏఏఎస్ కే ), కోదాడ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెస్ కళాశాల లో నిర్వహించే ఉచిత పాలిటెక్నిక్,టీఎస్ ఆర్ జెసి శిక్షణ కార్యక్రమమునకు సంబంధించిన కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిలుకూరు మండల విద్యాధికారి మాగి గురువయ్య,ఎమ్మెస్ కళాశాల కరస్పాండెంట్ పందిరి.నాగిరెడ్డిలు పాల్గొని కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.గత 15 సంవత్సరాల నుండి అనుభవం కలిగిన అధ్యాపకులచే శిక్షణ ఇస్తూ,రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధిస్తున్న అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం( ఆస్క్)ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత పాలిటెక్నిక్ టీఎస్ ఆర్ జెసి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం అధ్యక్షురాలు బల్గూరి స్నేహ దుర్గయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆస్క్ ప్రధాన కార్యదర్శి మాతంగి ప్రభాకర్ రావు,కోర్స్ డైరెక్టర్ యలమర్తి శౌరి,కోర్స్ కో ఆర్డినేటర్ గంధం బుచ్చారావు,పిడమర్తి వెంకటేశ్వర్లు,నందిపాటి సైదులు,కుడుముల స్వామి దాసు,అమరబోయిన వెంకటరత్నం,మేళ్లచెరువు వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.