ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ ను సద్వినియోగం చేసుకోవాలి
:అడ్మిషన్ లను ప్రారంభించిన ఆస్క్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు
:పదవ తరగతి పరీక్షలు రాసిన ప్రతి ఒక్క విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవచ్చు
Mbmtelugunews// కోదాడ,ఏప్రిల్ 03(ప్రతినిధి మాతంగి సురేష్):అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పాలిటెక్నిక్ టిఎస్ఆర్ జెసి కోచింగ్ సెంటర్ ను 10 పరీక్షలు రాసిన ప్రతి ఒక్క విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోర్సు కోఆర్డినేటర్ గంధం బుచ్చారావు అన్నారు.గురువారం స్థానిక ఎమ్మెస్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఆస్క్ ఉచిత కోచింగ్ అడ్మిషన్ల కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి విద్యార్థిని తల్లిదండ్రులకు అడ్మిషన్ ను అందించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కోదాడ,హుజూర్ నగర్ నియోజకవర్గాల విద్యార్థులు ఈ కోచింగ్ ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.క్లాసులు ఈనెల 5వ తారీఖు నుండి ప్రారంభించడం జరుగుతున్నది కావున విద్యార్థులు త్వరగా వారి యొక్క అడ్మిషన్లను ఎమ్మెస్ కళాశాలలో ఏర్పాటుచేసిన కౌంటర్ వద్దకు వచ్చి అప్లికేషన్ నింపి అడ్మిషన్ పొందాలని అన్నారు.ఈ యొక్క కార్యక్రమంలో కోర్సు ఇన్స్ట్రక్షరూ మీసాల రవి,మాతంగి సురేష్,విద్యార్థిని తల్లిదండ్రులు రామారావు తదితరులు పాల్గొన్నారు.