ఉచిత బస్సు ప్రయాణం వల్ల పెరిగిన మహిళల రద్దీ
:దీనిని ఆసరాగా చేసుకొని దొంగలు బీభత్సం
:పండగల సమయంలో మరి ఎక్కువ రద్దీ
:సీట్ల కోసం కొట్టుకుంటున్న వైనం
:కనిపించని పోలీసులు.
Mbmtelugunews//కోదాడ,జనవరి 11 (ప్రతినిధి మాతంగి సురేష్):సంక్రాంతి పండగ వచ్చిందంటే ఆర్టీసీ బస్సులు కళకళలాడుతుంటాయి అన్న సంగతి అందరికీ తెలిసిందే.కానీ తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో రద్దీ కాస్త ఇంకా ఎక్కువైంది బస్సులో సిట్టింగ్ కంటే నిలబడే వాళ్లే ఎక్కువమంది ఉంటున్నారు.బస్సు ఎక్కే సమయంలో మహిళలు కూర్చోవడానికి సీట్ల కోసం భారీగా గుంపు కూడి ఎక్కుతున్న సమయంలో అదే అదునుగా చేసుకొని కొంతమంది దొంగతనాలకు పాల్పడుతున్నారు.మహిళలు నా సీట్ అంటూ నా సీట్ అని పోట్లాడుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి.అన్ని జరుగుతున్న పోలీస్ సిబ్బందిని బస్టాండ్ లో ఏర్పాటు చేయడానికి వెనకాడుతున్నారు.మామూలు సమయంలో అనుకుంటే ఓకే ఇప్పుడు పండగ సమయం కాబట్టి బస్టాండ్ లో రద్దీ ఎక్కువగా ఉంటుంది.ఇది దొంగలకి ఎంతో సులువు కావున పోలీస్ సిబ్బందిని బస్టాండ్ లో ఏర్పాటు చేసినట్లయితే కొంతమేర దొంగతనాలు నియంత్రించవచ్చని పలువురు వాపోతున్నారు.అసలే ఆర్టీసీ బస్టాండ్ లో సీసీ కెమెరాలు ఉన్న అవి పనిచేయవు ఏదైనా దొంగతనం జరిగినప్పుడు కెమెరాలు చూసి దొంగలను పట్టుకోవచ్చు అనుకుంటే ఆ కెమెరాలు పనిచేయవని సంబంధిత సిబ్బంది బాహాటంగా చెప్తుంటారు.ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని దొంగతనాలు జరగకుండా,బస్సు రాగానే ఎక్కువమంది గుంపుగా ఉండకుండా చూడాలని పలువురు పోతున్నారు.