ఉచిత వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని సందర్శించిన:సాయి రాజు
కోదాడ,మే 24(mbmtelugunews)ప్రతినిధి మతం సురేష్:మండల పరిధిలోని చిమిర్యాల గ్రామంలో 21వ రోజు ఉచిత వేసవి వాలీబాల్ శిక్షణ శిబిరానికి విచ్చేసిన జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు సాయి రాజును ఘనంగా సన్మానించిన క్రీడాకారులు.అదేవిధంగా ప్రముఖ అడ్వకేట్ తాటి మురళి క్రీడాకారులకు ఫ్రూట్స్,పెన్నులు పంపిణీ చేసి క్రీడాకారులు ఆటలలో మరియు చదువులో రాణించాలని ఉన్నతమైన లక్ష్యాలు అధిరోహించాలని పుట్టిన గ్రామానికి పేరు తీసుకుని రావాలని మాట్లాడారు.ఈ కార్యక్రమంలో కోచ్ కళ్యాణ్ బాబు,క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు



