కోదాడ,ఏప్రిల్ 24(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం (ఆస్క్) ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెస్ కళాశాలలో నిర్వహించబడుతున్న ఉచిత పాలిటెక్నిక్ ప్రవేశ శిక్షణ కేంద్రానికి ముఖ్య అతిథులుగా ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ పాల్గొని మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనా కేంద్రం (ఆస్క్) వారు అందిస్తున్న ఉచిత పాలిటెక్నిక్ శిక్షణ కేంద్రంను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు.మీ బంగారు భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునే బాధ్యత మీ పైనే ఉందని,ఉచిత శిక్షణ అని తక్కువ అంచనా వేయకుండా శిక్షణ వారు ఇస్తున్న శిక్షణను క్రమశిక్షణతో విని మంచి ఫలితాలు సాధించి మీ తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని అన్నారు.

విద్యార్థులకు ఈ సమయం చాలా విలువైనది ఈ సమయంలో మీరు ఎటు అంటే అటువైపు ప్రయాణించే వయస్సు కావున చరవాణిలకు దూరంగా ఉండాలని ఆన్ లైన్ ఆటలకు స్వస్తి పలకాలని అన్నారు. అనంతరం ఆస్క్ సభ్యుల ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్ఐను శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఆస్క్ ప్రధాన కార్యదర్శి మాతంగి ప్రభాకర్ రావు,కోర్సు డైరెక్టర్ ఎలమర్తి శౌరి,ఎంఈఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు చేకూరి రమేష్,అమరబోయిన వెంకటరత్నం,శ్రీకాంత్,జార్జి,విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
మీ ప్రాంతంలో ఏమైనా సమాచారం ఉంటే ఈ నెంబర్ 9666358480 కి పంపించగలరు



