Monday, December 23, 2024
[t4b-ticker]

ఉచిత స్వర్ణప్రాసన పంపిణీ……..

- Advertisment -spot_img

ఉచిత స్వర్ణప్రాసన పంపిణీ……..

కోదాడ,ఆగష్టు 03(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:శనివారం పుష్య నక్షత్రాన్ని పురస్కరించుకొని కోదాడ వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో పిల్లలకు ఉచిత స్వర్ణప్రాసన పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.మున్సిపల్ పరిధిలోని తమ్మరలో గల డాక్టర్ సురేష్ జకోటియా హాస్పటల్ ఆవరణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ జకోటియా మాట్లాడుతూ 16 సంవత్సరాల లోపు పిల్లలకు ఈ స్వర్ణప్రాసన మందు పంపిణీ జరుగుతుందన్నారు.ఈ మందు పిల్లలకు ఇవ్వడం వల్ల పిల్లలలో రోగ నిరోధక శక్తి మానసిక వికాసము సమగ్ర అభివృద్ధి పెరుగుతుందన్నారు.ఈ సందర్భంగా వంద మంది పిల్లలకు స్వర్ణప్రాసనమందును ఉచితంగా అందజేశారు.ప్రతి పుష్య నక్షత్రం రోజున ఈ స్వర్ణప్రాసన మందును పిల్లలకు అందించే విధంగా తల్లిదండ్రులు ప్రయత్నించాలన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్లు వంగవీటి భరత్ చంద్ర,గడ్డం శ్రీ లక్ష్మీ ప్రసన్న,వాసవి యూత్ క్లబ్ అధ్యక్షుడు ఇమ్మడి అనంత చక్రవర్తి,ఐపిసీ పబ్బగీత,యాదారాణి,చక్ర శ్రీ, మేఘనాథ్,భరత్,ఓరుగంటి నిఖిల్,అఖిల్ తదితరులు పాల్గొన్నారు

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular