Mbmtelugunews//కోదాడ,అక్టోబర్ 01(ప్రతినిధి మాతంగి సురేష్):అక్షర ఫౌండేషన్ వారిచేత రాష్ట్రస్థాయి ఉత్తమ మండల విద్యాధికారిగా గుర్తించబడి,అవార్డు పొందిన సందర్భంగా కోదాడ మండల విద్యాధికారి,బాలుర ఉన్నత పాఠశాల కోదాడ ప్రధానోపాధ్యాయులు ఎండి సలీం షరీఫ్ ని మంగళవారం నాడు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా పూలమాల శాలువాతో అభినందనలు సన్మానం చేయడం జరిగింది.బాధ్యత,అంకితభావంతో పనిచేసి సత్ఫలితాలను సాధించాలని ఈ సందర్భంగా ఎండి సలీం షరీఫ్ విద్యార్థులు,ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు.ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి మార్కండేయ,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.
ఉత్తమ ఎంఈఓ గా ఎన్నికైన ఎంఈఓ సలీం షరీఫ్ కు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘన సన్మానం
RELATED ARTICLES