ఉత్తమ తహసిల్దార్ ను అభినందించిన డివైఎఫ్ఐ
Mbmtelugunews//కోదాడ (నడిగూడెం), ఆగస్టు 20 (మనం న్యూస్): ఉత్తమ తహసిల్దార్ ఎంపికైన నడిగూడెం మండల ఎమ్మార్వో సరితని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) ఆధ్వర్యంలో మొక్కను బహూకరించి అభినందనలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కాసాని కిషోర్ మాట్లాడుతూ జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎమ్మార్వో సరిత ని అభినందిస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు పేదలకు అందేలా చేయాలని ఆశిస్తూ నడిగూడెం మండలాన్ని అభివృద్ధిలో జిల్లాలో మొదటి స్థానంలో నిలుపుతారని ఆశిస్తూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ నడిగూడెం మండల కమిటీ మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు జమ్మి ఎల్లయ్య, మండల కార్యదర్శి కేశగాని భద్రయ్య డివైఎఫ్ఐ మండల సహాయ కార్యదర్శి నోసిన అంజి తదితరులు పాల్గొనడం జరిగింది.



