ఉత్తర కొరియాలో వరదలను అడ్డుకోలేదని 30 మందికి మరణశిక్ష
Mbmtelugunews/ఉత్తరకొరియా,సెప్టెంబర్ 05:ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ నియంతృత్వ పాలన మరోసారి బయట పడింది.
ఇటీవల ఆ దేశం
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన సంగతి
తెలిసిందే.
ఈ క్రమంలోనే విపత్తు నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన
చర్యలకు సిద్ధమయ్యారు.
దాదాపు 30 మంది ప్రభుత్వ అధికారులకు మరణశిక్ష అమలుచేయాలని
కిమ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.