ఉద్యమకారులకు ఎప్పుడు అండగా ఉంటా…
తెలంగాణ ఉద్యమంలో రాయపూడి పాత్ర కీలకమైనది
ఉద్యమ నేత పార్టీలోకి రావడం శుభ పరిణామం…
కోదాడ,మే 09(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యమకారుడి కి అండగా ఉంటానని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు అన్నారు.తెలంగాణ ముఖద్వారమైన కోదాడలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం పనిచేసిన ఉద్యమకారుడు రాయపూడి వెంకటనారాయణ దంపతులు పద్మావతి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కోదాడలో ఉద్యమం చేసిన ఉద్యమకారులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని అన్నారు.కెసిఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని మరల తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె అన్నారు.తెలంగాణ ఉద్యమంలో రాయపూడి వెంకటనారాయణ పాత్ర కీలకమైనదని, వారు పార్టీలోకి రావడం శుభ పరిణామన్నారు. జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాన్ని ఎమ్మెల్యేకు రాయపూడి దంపతులు బహుకరించారు.



