ఉన్నత లక్ష్యం నీ ఆశయమైతే చదువే ఆయుధం:చెరుకుపల్లి కిరణ్
Mbmtelugunews//కోదాడ,జనవరి 17(ప్రతినిధి మాతంగి సురేష్)సంక్రాంతి సందర్భంగా మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో నిర్వహించినటువంటి చెస్,క్యారమ్స్ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించే బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్వేరోస్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ చెరుకుపల్లి కిరణ్ పాల్గొన్నారు..ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి పోటీలు ఎంతగానో ఉపకరిస్తాయని,

అలాగే ఆటపాటలతో పాటు విద్యార్థులు చదువుల్లోనూ రాణించాలని ఉన్నత లక్ష్యాలను పెట్టుకొని వాటిని సాధించడానికి చదువుని ఒక ఆయుధంగా మలుచుకోవాలని తద్వారా సమాజం దేశం అభివృద్ధికి పాటుపడాలని కోరారు.ఇతర అతిథులతో కలిసి విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.కార్యక్రమంలో అంబోజి వెంకటేశ్వర్లు,సింధుజ,మిట్ట గడుపుల శివాని విద్యార్థులు తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గొన్నారు..



