పని ప్రదేశంలో కూలీలకు ఇబ్బందులు లేకుండా చూడాలి
వడ దెబ్బకు ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలి.
ఉపాధి హామీ కూలీలకు ఓఅర్.ఎస్ ప్యాకెట్ లు పంపిణీ చేసిన పిఏసీఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి.
కోదాడ,ఏప్రిల్ 20(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఉపాధి హామీ కూలీలు వడ దెబ్బ కు గురి కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోదాడ పిఏసీఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. శనివారం కోదాడ మండల పరిధిలోని గుడిబండ లో ఉపాధి హామీ కూలీలకు ఆరోగ్య శాఖ సరఫరా చేసిన ఓఆర్ఎస్ ప్యాకెట్ లను పంపిణీ చేసి మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకీ భానుడు భగభగమంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఉపాధి హామీ కూలీలు ఎండ తీవ్రత లేని సమయంలో పనులు చేసుకోవాలన్నారు.తగిన జాగ్రత్తలతో వడ దెబ్బ తగులకుండా పనులు పూర్తి చేయాలన్నారు.నీళ్లు ఎక్కువగా తాగాలన్నారు.పని ప్రదేశం లో కూలీలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు.ఓఅర్ ఎస్ ద్రావణం తరుచుగా తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ భూతం బిక్షం,ఉపాధి హామీ కూలీలు ఉన్నారు.
మీ ప్రాంతంలో ఏమైనా సమాచారం ఉంటే ఈ నెంబర్ 9666358480 కి పంపించగలరు



