ఉపాధి హామీ కూలీల సమస్యలను తెలుసుకుంటున్న పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి
కోదాడ,మే 20(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మండల పరిధిలోని గుడిబండ గ్రామంలోని ఉపాధి హామీ పనులు చేస్తున్న వారితో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు పని దినాలు చాలా తక్కువగా ఇస్తున్నారని అన్నారు.కూలీలకు వంద రోజులు పని దినాలు కల్పించడం లేదు రోజుకు 300 రూపాయలు అంటున్నారు కానీ చాలా తక్కువ డబ్బులు వస్తున్నాయి రోజు కూలి అంటున్నారని అన్నారు.వారి యొక్క డిమాండ్ ఏమనగా రోజుకి 400 రూపాయలు ఇవ్వాలి ప్రతి ఒక్కరికి వంద రోజులు పని దినాలు కల్పించాలని వారు తెలియజేసినారని అన్నారు.



