ఉపాధి హామీ పథకంలో భారీ కుంభకోణం బహిర్గతం
మృతుడికిచెల్లింపులు, పనులలో లోపాలపై డి ఆర్ డి ఓ పిడి శిరీష హెచ్చరిక.
- డిమాండ్ ఫారంలు లేకపోవడంపై సీఈఓ ఆగ్రహం..
చింతలపాలెం ,మార్చి 26 mbmtelugunews.com// సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో తీవ్ర అవకతవకలు బహిర్గతమయ్యాయి. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన నాలుగో విడత సామాజిక తనిఖీ ప్రజావేదికలో అనేక షాకింగ్ విషయాలు బయటపడటంతో అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.జడ్పీ సీఈఓ, డీఆర్‌డీఏ పీడీ శిరీష ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు మండలంలోని 16 గ్రామపంచాయతీల్లో అమలైన పనులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. నివేదిక ప్రకారం ఈజీఎస్ కింద 484 పనులకు ₹5,37,98,037, పంచాయతీరాజ్ విభాగం కింద 48 పనులకు ₹3,01,79,834 నిధులు ఖర్చు చేసినట్లు వెల్లడైంది.అయితే ఖర్చుల వెనుక తీవ్ర నిర్లక్ష్యం, అవకతవకలు బయటపడటం గమనార్హం. అనేక గ్రామాల్లో డిమాండ్ ఫారమ్‌లు లేకపోవడం పై సీఈఓ శిరీష తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తప్పుడు నివేదికతో వివిధ గ్రామాల్లో రికవరీ కి నివేదిక ఇచ్చిన డి ఆర్ డి ఓ పి డి ఇచ్చిన వివరాలు గ్రామాలు…అడ్లూరు గ్రామంలో మొత్తం రికవరీ 2,50,254 రూపాయలు, చింతలపాలెంలో 7698 రూపాయలు, చింత్రియాల్లో 7930 రూపాయలు, దొండపాడులో 34676 రూపాయలు, గుడిమల్కాపురంలో 12,352, కిష్టాపురం లో 94,683 రూపాయిలు, కొత్తగూడెం దండులో 13,200, పిక్లా నాయక్ తండ 6081రూపాయలు, పులిచింతల ప్రాజెక్టు కాలనీ 2376 రూపాయలు, రేపల్లె 11159 రూపాయలు, తమరు 9375 రూపాయలు, వదినేపల్లి 11738 రూపాయలు, ఎర్రగుంట తండా 5794
విధివిధానాలను పూర్తిగా పక్కనబెట్టి పనులు నిర్వహించడం బాధ్యతారాహిత్యంగా పేర్కొన్నారు.కిష్టాపురం గ్రామంలో ఉపాధి హామీ బోర్డు ఏర్పాటు పేరుతో రూ.5,500 బిల్లు తీసుకుని, ఫోటోలో మాత్రమే బోర్డు చూపించి, వాస్తవంగా అక్కడ బోర్డు లేకపోవడం బయటపడింది. ఇది నిధుల దుర్వినియోగానికి స్పష్టమైనది గా నిలిచింది.
వజినేపల్లి గ్రామంలో నాటిన 960 మొక్కలు ఎండిపోవడం, వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటకపోవడం పై సంబంధిత కార్యదర్శిపై సీఈఓ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యవేక్షణ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
అత్యంత సంచలనంగా, చనిపోయిన వ్యక్తి పేరుతో ఉపాధి హామీ కింద పనిచేసిన వ్యక్తి అకౌంట్లో చెల్లింపులు కొనసాగడం బయటపడింది. ఈ ఘటన వ్యవస్థలో ఉన్న లోపాలు మాత్రమే కాకుండా, అవినీతి తీవ్రతను బహిర్గతం చేసింది.ఈ అవకతవకలపై అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు. ఆ కాలంలో సంబంధిత బాధ్యులపై రికవరీతో పాటు పెనాల్టీలు విధించినట్లు తెలిపారు. ఇకపై ఉపాధి హామీ పథకంలో ఎలాంటి అవకతవకలను సహించబోమని సీఈఓ శిరీష హెచ్చరించారు. పనులు పూర్తిగా పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామచంద్రరావు, ఎంపీఓ భూపాల్ రెడ్డి, ఏపీడీ ఆమని, అంబుడ్స్‌మన్ లచ్చిరామ్ నాయక్, శివాజీ, విజిలెన్స్ఇన్సూరెన్స్ మేనేజర్ ఆశలత, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ రామకృష్ణ, ఏపీఓ జ్యోతి, గ్రామపంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.



