కోదాడ,జనవరి19(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:గత ప్రభుత్వం మధ్యలో ఆపిన ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు వెంటనే కల్పించాలని యస్సీ యస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమరబొయిన వెంకటరత్నం అన్నారు.శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి పాల్గొని క్యాలెండర్ ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ 317 జీఓ తో ఉపాధ్యాయులు తీవ్ర గందరగోళం లో పడ్డారని జీరో సర్వీస్ తో బదిలీలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మాతంగి ప్రభాకర్ రావు,రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బొడ్డు హుస్సేన్,సూరేపల్లి దేవుడు,సీనియర్ నాయకులు రువ్వా సంజీవ్ పవన్ కుమార్,మేరిగ వెంకయ్య,పిడమర్తి వెంకటేశ్వర్లు,నందిపాటి సుధాకర్,పిడమర్తి అంకులయ్య,సిహెచ్ రమేష్,చిన్నపంగు సుందర్ రావు,కొండ పూర్ణచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులకు వెంటనే బదిలీలు,పదోన్నతులు కల్పించాలి
RELATED ARTICLES



