ఉపాధ్యాయులు జాతి నిర్మాతలు…
:ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి మరొకటి లేదు…
:విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే……
:విద్యారంగానికి చలసాని శేఖర్ సేవలు ప్రశంసనీయం..
:కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు…
Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 05(ప్రతినిధి మాతంగి సురేష్): ఉపాధ్యాయులు జాతి నిర్మాతలని, విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పైనే ఉందని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని వేమూరి ఫంక్షన్ హాల్ లో అనంతగిరి మండలం వాయిల సింగారం హై స్కూల్ ప్రధానోపాధ్యాయుని గా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన చలసాని శేఖర్ అభినందన సభలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందన్నారు. విద్యారంగ అభివృద్ధికి ఎమ్మెల్యే పద్మావతి సహకారంతో కృషి చేస్తానన్నారు. గత నాలుగు దశాబ్దాలుగా శేఖర్ విద్యా రంగానికి చేసిన సేవలను ప్రశంసించారు. అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులకు సమాజంలో అన్నివేళలా గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెల సీతారామయ్య, పిఆర్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్, చిలుకూరు అనంతగిరి ఎంఈఓ లు నరసింహారెడ్డి తల్లాడ శ్రీనివాస్,విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా ప్రెసిడెంట్ బొల్లు రాంబాబు, ఓరుగంటి రవి పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉన్నారు.



