హుజూర్ నగర్,జనవరి 12(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మద్యలో ఆగిపొయిన ఉపాద్యాయుల బదిలీలు పదోన్నతులు వెంటనే చేపట్టాలని యస్సీ యస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మాతంగి ప్రభాకర్ రావు డిమాండ్ చేశారు.317జీవో అమలు పేరుతో గత ప్రభుత్వం ఉపాధ్యాయులు,ఉద్యోగులను ఆధోళనకు గురి చేసింది.భార్యా,భర్తల బదిలీలు జరిపి వారికి న్యాయం చేయాలని కోరారు.శుక్రవారం హుజూర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో సంఘం క్యాలెండర్ ఆవిష్కరించినారు.అనంతరం వారు మాట్లాడుతు ఉపాధ్యాయులు ఉన్నతి,లక్ష్య,మాసవారీ పరీక్షలు,యఫ్ ఏ లతో విద్యార్ధులు గంధరగోళానికి గురి అవుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సూరేపల్లి దేవుడు,నియోజకవర్గ కన్వీనర్ భూషణ్ బాబు, మహిళా నాయకులు పులి దీనారాణి, బయ్యారపు శ్రీదేవి, శేషగిరి, శేఖర్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి, శైలజ జనార్దన్ రెడ్డి,అస్మాముబిన్,మున్నిబేగం,శ్రీకాంత్,కాంతి బాయి తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు వెంటనే చేపట్టాలి
RELATED ARTICLES



