Sunday, July 6, 2025
[t4b-ticker]

ఉపాధ్యాయుల సమస్యలే ప్రధాన ఎజెండాగా పనిచేస్తుంది పిఆర్టియు

ఉపాధ్యాయుల సమస్యలే ప్రధాన ఎజెండాగా పనిచేస్తుంది పిఆర్టియు

:విద్యలో అనేక సంస్కరణలు తీసుకురాటంలో పిఆర్టియుది ఎనలేని కృషి

:ఉపాధ్యాయుల శాసనమండలి ఎన్నికల్లో వరంగల్ పిఆర్టియు అభ్యర్థి శ్రీపాల్ రెడ్డిని గెలిపించాలి

:మాజీ ఎమ్మెల్సీ,మాజీ రాష్ట్ర పిఆర్టియు అధ్యక్షులు బి మోహన్ రెడ్డి

Mbmtelugunews//కోదాడ,జనవరి 29 (ప్రతినిధి మాతంగి సురేష్):ఫిబ్రవరి 27న జరగనున్న ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలలో వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ,మాజీ రాష్ట్ర పీఆర్టీయూ అధ్యక్షులు బి మోహన్ రెడ్డి అన్నారు.స్థానిక శ్రీమన్నారాయణ కాలనీలో గల పిఆర్టియు కార్యాలయంలో విలేకరుల సమావేశం బుధవారం ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బి మోహన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో పిఆర్టియు పాత్ర చాలా కీలకమైనదని అన్నారు.ఉపాధ్యాయుల ప్రమోషన్ విషయంలో ప్రతి స్కూల్ లో స్కూల్ అసిస్టెంట్ ని తీసుకొచ్చిన ఘనత పిఆర్టియుదని అన్నారు.గతంలో ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ పోస్టు ఉండకపోయేది అలాంటి పోస్టులు కూడా క్రియేట్ చేసి ఉపాధ్యాయులను పెట్టిన ఘనత మాదేనని అన్నారు.గతంలో హై స్కూల్ హెడ్మాస్టర్లు ఉండేవారు కాదు ఆ స్కూల్లో పనిచేసే టీచర్ కి బాధ్యతలు ఇచ్చేవారు ఆ సమయంలో ఆ ఉపాధ్యాయులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని పిఆర్టియు తెలుసుకొని హెడ్మాస్టర్ పోస్ట్ లు ఇవ్వాలని రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ లో 6000ల హెడ్మాస్టర్లు పోస్ట్ లు తీసుకొచ్చిన ఘనత పిఆర్టియుదని అన్నారు.విద్యా విధానంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి విద్యలో మార్పులు తీసుకురావడానికి మేము ఎంతో కృషి చేశామని అన్నారు.గతంలో ఉపాధ్యాయుల బదిలీ ప్రమోషన్లు విషయంలో పొలిటికల్ జోక్యం చేసుకోని ఉపాధ్యాయుల వద్ద డబ్బులు తీసుకుని వాళ్లకు నచ్చిన ప్రాంతాలలో బదిలీలు ప్రమోషన్లు కల్పించేవారు అలా చేయడం వలన ఉపాధ్యాయులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని తెలుసుకొని పిఆర్టియు ఎన్నో ధర్నాల నిర్వహించి బదిలీల ప్రమోషన్ల విషయంలో కౌన్సిలింగ్ ఏర్పాటు చేయించిన ఘనత పిఆర్టియుదని అన్నారు.మహిళ టీచర్లకు అందరు టీచర్లతో పాటు 22 సెలవులు ఉంటే మేము అదనంగా ఐదు సెలవులు ఇప్పించడానికి ఎనలేని కృషిచేసి సాధించామని అన్నారు.రానున్న కౌన్సిల్లో మళ్ళీ మహిళా టీచర్లకు ఐదు సెలవులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.గతంలో మహిళలకు మేటర్నిటీ సెలవులు లేవు వాటిని తీసుకురావడానికి ఎంతో కృషి చేశామని అన్నారు.పంచాయతీరాజు ఉపాధ్యాయులను ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మార్చిన ఘనత పిఆర్టియుడని అన్నారు.ఏకీకృత సర్వీస్ రూల్స్ ముఖ్యమంత్రితో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు.మహిళ టీచర్స్ డెలివరీ అయినా వారి భర్తలకు సెలవులు ఇవ్వడానికి ఎంతో కృషి చేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు తీసుకొస్తామని అన్నారు.ఎస్జీటీలకు ఉపాధ్యాయుల శాసనమండలి ఎన్నికలలో ఓటు హక్కు కల్పించడానికి కృషి చేస్తున్నామని అన్నారు.ఇంకా ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న పిఆర్టియుని ప్రతి ఒక్క ఉపాధ్యాయులు ఆదరించి రానున్న ఎమ్మెల్సీ వరంగల్ ఎన్నికలలో శ్రీపాల్ రెడ్డికి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటారని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సూర్యాపేట జిల్లా పిఆర్టియు అధ్యక్షులు బొల్లు రాంబాబు,మాజీ గెజిటెడ్ హెచ్ఎం ఓరుగంటి రవి తదితరులు పాల్గొన్నారు

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular